calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

20-08-2025 01:42:58 AM

ప్రియాంక గాంధీ మద్దతు.. ఇది కేంద్రం వివక్ష అని విమర్శ

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : తెలంగాణ రైతులు ఎదుర్కొం టున్న యూరియా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మంగళవారం కూడా  ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఎంపీల నిరసనకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ మద్దతిచ్చారు. ఎంపీ లు చేపట్టిన నిరసనలో ప్రియాంగాంధీ పాల్గొన్నారు. తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ప్రియాంకగాంధీ విమర్శించారు.

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన యూరియాను సరఫరా చేయకుండా రైతు లను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. యూరియా సమస్యను జీరో అవర్‌లో లేవనెత్తుతానని తెలిపారు. అంతకు ముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కాంగ్రెస్ ఎంపీలు కలిసి తెలంగాణకు రావాల్సిన 3 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరారు.  తెలంగాణకు రావాల్సిన యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు దారి మల్లిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి  ఆరోపించారు.