calender_icon.png 20 August, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం గురుకులాల తనిఖీ

20-08-2025 01:42:38 AM

  1. అంకిరెడ్డిపల్లి జ్యోతిబాపూలే గురుకులం తనిఖీ 

వర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

మేడ్చల్, ఆగస్టు 19(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి లోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పా ఠశాల, కళాశాలను కలెక్టర్ మను చౌదరి ఈ నెల 11న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహా రం వసతులను పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే గురుకులాన్ని మళ్లీ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మంగళవారం తనిఖీ చేశారు. ఆహారం, వసతులు అ న్ని పరిశీలించారు.

విద్యార్థినిలతో మాట్లాడారు. తొమ్మిది రోజుల్లో కలెక్టర్, అదనపు క లెక్టర్ తనిఖీ చేయడం విశేషం. గతంలో గు రుకులాలు, వసతి గృహాలు, ఆస్పత్రులను ఏ అధికారి తనిఖీ చేసిన దాఖలాలు లేవు. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందు కు కూడా అవకాశం ఉండేది కాదు.

కానీ ప్ర స్తుతం కలెక్టర్, అదనపు కలెక్టర్ వచ్చి సమస్యల గురించి విద్యార్థులను అడుగుతు న్నారు. తనిఖీలు పెరగడంతో వార్డెన్లు, ప్రిన్సిపాల్ లు నాణ్యమైన ఆహారం అందించేందు కు చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం నిఘా వల్ల విద్యార్థులకు నాణ్యమైన ఆహా రం అందుతుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అద్దె భవనంలో గురుకులం 

అంకిరెడ్డిపల్లి లో మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఉప్పల్, కుత్బుల్లాపూర్ కు మంజూరైన గురుకులాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ నీటి కొరత ఉంది. నీరు సరిపోవటం లేదని ప్రిన్సిపల్ రాజమణి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎస్టిమేషన్ పంపించాలని కలెక్టర్ సూచించారు. తనిఖీ చేయడం వల్ల నీటి సమస్య కలెక్టర్ దృష్టికి వచ్చింది. వరుస తనిఖీలవల్ల విద్యార్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. గతంలో పురుగుల అన్నం, నీళ్ల చా రు తినలేక పోయేవారు. ప్రస్తుతం మంచి మెనూ అందిస్తున్నారు. 

నాణ్యమైన ఆహారం అందించాలి 

విద్యార్థినిలకు నాణ్యమైన ఆహారం అం దించాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ప్రి న్సిపాల్ కు సూచించారు. వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించి పురుగులు దోమలు లే కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీ సుకోవాలని, ఆహారం కలుషితమై విద్యార్థినిలు అనారోగ్యానికి గురికావడం వంటి సం ఘటనలు జరగకూడదన్నారు.

పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థినులను, ప్రిన్సిపాల్ ను అడిగారు. నేను ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు.