15 May, 2026 | 2:07 AM

అబద్ధాల కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

23-04-2024 01:58 AM

జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్, ఏప్రిల్ 22: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని హుస్సేన్‌నగర్, చీకూర్తి, అమీరాబాద్, కాకిజన వాడ, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్, హుమ్నపూర్ గ్రామాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్‌కుమార్‌కు మద్ధతుగా ప్రచారానికి శ్రీకా రం చుట్టారు.

ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాంగ్రె స్ ప్రభుత్వం ఇచ్చిన అబద్ధ్దాలు హామీలు, వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో తనను గెలిపించిన మాధిరిగానే గాలి అనిల్‌కుమార్‌కు భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యక ర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త దేవిశ్రీప్రసాద్, అత్మకమిటీ మాజీ చైర్మన్ పెంటారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, నాయకులు భాస్కర్, సం గ్రాంపాటిల్, ప్రవీణ్‌కుమార్, భూమరెడ్డి, రాజేంధర్‌రెడ్డి, అశోక్, అనీఫ్, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనీల్‌కుమార్, నర్సారెడ్డి పాల్గొన్నారు.