నీటి సరఫరాలో అంతరాయం ఉండవద్దు
23-04-2024 02:00 AM
l అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వచ్చే నెలరోజలపాటు రాష్ట్రం లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని సీఎస్ శాంతి కు మారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయం రాకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో మున్సిపల్, నీటి పారుదల, పంచాయితీరాజ్ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వ హించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో నీటి పరిస్థితి ని ప్రస్తావిస్తూ సంబంధిత సీజీఎంలు ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రతామ్నాయ సరఫరా చేయాలన్నారు.






