20 April, 2026 | 7:57 PM

సీఎం సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

20-04-2026 06:44 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణం నుంచి  ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పిలుపు మేరకు సోమవారం సాయంత్రం కాటారంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు మూడో వార్డు, నాలుగో వార్డ్ నుండి మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ రఫిక్ తో కలిసి వార్డు ప్రజలను సభకు ఆర్టీసీ బస్సుల ద్వారా పెద్ద ఎత్తున తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అల్లంకి శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు , పెద్ద ఎత్తున తరలి వెళ్లారు, అలాగే సుల్తానాబాద్ అన్ని మున్సిపల్ వార్డులతోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం సభకు తరలి వెళ్లడం జరిగింది.