02-12-2025 02:08:40 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రం, మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎలక్షన్ అభ్యర్థులకు ఎస్సై మహేష్ ముఖ్య సూచన. 03 నుండి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న సందర్బంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, నామినేషన్ సెంటర్ వద్ద నుండి 100 మీటర్ దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నామినేషన్ సెంటర్ నుండి 100 మీటర్ దూరం లోపలకి అభ్యర్థితో పాటు ఇద్దరు తప్ప ఎవరిని లోనికి అనుమతి లేదని, ర్యాలీలు, ఊరేగింపులు తహసీల్దార్ అనుమతి తీసుకొవల్సింది, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వేలన్స్ టీమ్స్, పోలీసు, టాస్క్ఫోర్స్ టీమ్స్ తిరుగుతయాని, ఎవరైనా ఏమి కాదులే అని ఉల్లంఘన చేస్తే కేసులు తప్పవని , ఒక ఎలక్షన్ కేసు నమోదు అయితే ఇబ్బందులు తప్పవని జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మహేష్ ప్రజలకు హెచ్చరిక.