calender_icon.png 31 July, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించాలి

30-07-2025 04:58:20 PM

ఒడితల ప్రణవ్ బాబు..

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఓడితల ప్రణవ్ బాబు కోరారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపర్డెంట్ నారాయణరెడ్డితో కలిసి హాస్పిటల్ లోని వార్డులను సందర్శించారు. రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శానిటేషన్, హాస్పటల్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎన్ డి ఎఫ్ అండ్ ద్వారా హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల చొప్పున పండు రిలీజ్ చేసిందన్నారు వాటితో పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. 100 డెలివరీ పూర్తి కావడం విశేషం అన్నారు వైద్యులను అభినందించారు. రోగులకు మరింత భరోసా ఇచ్చేలా సేవలందించాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు. హాస్పిటల్ అభివృద్ధికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహనుకలిసి నిధులు తీసుకు వస్తానని  హామీ ఇచ్చారు. డాక్టర్ల కొరత లేకుండా కలెక్టర్ డిమ్& హెచ్ ఓ తో మాట్లాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు కిరణ్, మహిళా పట్టణ అధ్యక్షురాలు పుష్పలత, కాజీపేట శ్రీనివాస్, సందమల్ల  బాబు,  నరేష్,  బాబు, రాహుల్, ఇప్పలపల్లి చంద్రశేఖర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.