calender_icon.png 31 July, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటమయ్య రక్షణ కిట్లు.. గౌడ కులస్తులకు వరం

30-07-2025 04:52:49 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో కాటమయ్య రక్షణ కిట్లు గౌడ కులస్తులకు పంపిణీ చేయడం వరమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల గీత కార్మికులకు కాటమయ్య రక్షన కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. కల్లు గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖల ద్వారా తెలంగాణ కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం సహకారంతో సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు  తెలిపారు. గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కుల వృత్తుల కు చేయూత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం నూతన రేషన్ కార్డులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, దాసరి శీను, జమ్మిలాల్, కందుకూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.