13-12-2025 12:51:37 PM
సిద్దిపేట క్రైం: అత్యవసర సమయంలో సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు రక్త దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా బీ పాజిటివ్ బ్లడ్ అవసరం ఏర్పడింది. ఈ విషయం పోలీస్ మిత్రులు ద్వారా తెలుసుకున్న కానిస్టేబుల్ రాజు ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రోగి కుటుంబసభ్యులు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.