calender_icon.png 13 December, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్న మీ జ్ఞాపకం మధురం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం

13-12-2025 12:55:04 PM

- ప్రజాసేవకు పరవశం సత్యనారాయణ వర్ధంతి వేడుక

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ఉమ్మడి ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆధారస్తంభంగా నిలిచిన సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా మసీద్‌బండ ప్రాంతం భావోద్వేగంతో నిండిపోయింది. 26 ఏళ్ల క్రితం పరమపదించినా ప్రజల్లో ‘సత్తన్న’గా నిలిచిన ఆయన పేరు మాత్రం కాలం చెరపలేకపోయింది. కుటుంబ సభ్యులు, నాయకులు,కార్యకర్తలు కలిసి శుక్రవారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సత్యనారాయణ ఆశయాలను కొనసాగిస్తున్న ద్వితీయ కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేస్తున్న క్రియాశీల సేవలు కార్యక్రమంలో ప్రధాన చర్చగా నిలిచాయి. పార్టీ బలోపేతానికి యువతను చేర్చడం, ప్రజల్లో పార్టీ ఆత్మను బలపరచడంలో ఆయన చూపుతున్న శ్రమను హాజరైన పలువురు నాయకులు ప్రశంసించారు.

కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎం. భిక్షపతి యాదవ్‌తో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరై సత్యనారాయణ సేవా వారసత్వాన్ని స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ సత్యనారాయణ సేవాస్ఫూర్తి మా ఇంటి బలం, సత్యనారాయణ సేవా సమితి ద్వారా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం ఆయన చూపిన మార్గమే. నాన్నగారు భౌతికంగా లేరన్న లోటు ఉన్నా ఆయన వేసిన పునాదే మా రాజకీయ ప్రయాణానికి దిశ. కాంగ్రెస్‌ ఆశయ సాధన కోసం మరింత క్రమబద్ధంగా పనిచేస్తానని తెలిపారు. సత్యనారాయణ ప్రజల్లో నాటి ప్రభావం ఎంత బలంగా ఉందో మళ్లీ ఒకసారి స్పష్టమైంది.