calender_icon.png 23 September, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

23-09-2025 12:25:13 AM

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 22: బిఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల సిబ్బందికి దసరా కానుకగా దుస్తువుల పంపిణీ చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  ఉప్పరిగూడ ,పోచారం, ఎలిమినేడు, తు లేకలన్, కప్పాడు, తుర్కగూడ, చెర్లపాటేల్ గూడ, కర్ణంగుడా గ్రామ పంచాయితీలకు గ్రాస్ కట్టర్లు, అదేవిధంగా సిబ్బందికి బిఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి దుస్తులను పం పిణి చేయడం జరిగింది.

మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల విషయంలో డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లకు బానిస కాకుండా వారిపై దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి కోరారు. అదేవిదంగా ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందికి కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

పంచాయతీ సిబ్బందికి సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలకు సంబంధించిన మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు, ఫౌండేషన్ సభ్యులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.