భార్య మృతి చెందిందన్న మనోవేదనతో భర్త ఆత్మహత్య
10-12-2024 09:46 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): అనారోగ్య సమస్యలతో భార్య మృతి చెందడంతో కలత చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన కె.మల్లయ్య(70) అతని భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అప్పటినుంచి మల్లయ్య మనోవేదనకు గురై సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.






