11-08-2025 12:56:42 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ, బాలాజీ కాలనీలలోని ఉప్పలమ్మ, జడల మైసమ్మ ఆలయాలలో ఆదివారం శ్రావణమాస బోనాలను ఘనం గా నిర్వహించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అమ్మవార్లను దర్శించుకొని, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ అమ్మవారి అనుగ్రహం పొం ది సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.