17-10-2025 12:34:10 AM
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూర్, అక్టోబరు 16 (విజయ క్రాంతి): ప్రజాహితమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్‌ఎండీ కాలనీలో ప్రజాభవన్ లో తిమ్మాపూర్ మండలానికి చెందిన 72 మందికి సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన 19 లక్షల 51వేల రూపాయల విలువ చేసే చెక్కులు ఆయన పంపిణీ చేశా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మం డల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లా క్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు గో పు మల్లారెడ్డి,
తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పో లు రాము, రమేశ్, చింతల లక్ష్మారెడ్డి, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, నో ముల అనిల్ గౌడ్, గోదారి తిరుపతి, జేజేల సంపత్, పోతుగంటి శ్రీనివాస్, మేడి అంజ య్య, బానుక సంపత్, రాయమల్లు, తదితరులుపాల్గొన్నారు.