17-10-2025 12:32:07 AM
అలంపూర్ అక్టోబర్ 16:అలంపూర్ ఆలయాలను కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ అధికారి నిఖిల్ దాస్ గురువారం దర్శించుకున్నారు.ముందుగా వీరు ఉభయ ఆలయాలను దర్శించుకుని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ఈవో దీప్తి ఆలయము నందు చేపట్టవలసిన ప లు అభివృద్ధి పనులు ,మరమ్మత్తుల గురించి చర్చించి అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ తెలిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ కేంద్ర పురాతత్వ శాఖ కన్సర్వేషన్ అసిస్టెంట్ వెంకటయ్య, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.