calender_icon.png 28 January, 2026 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి

28-01-2026 12:01:18 AM

జిల్లా ఇంచార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దేవరకొండ, జనవరి 27: మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జిల్లా ఇంచార్జి మంత్రి, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పున్న కైలాష్ నేత, దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన సన్నాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అతి త్వరలో జరగబోయే దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో 20కి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవాలి అనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ, దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పున్న కైలాష్ నేత మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం 

దివ్యాంగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంజూరైన  స్కూటీలు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు దివ్యాంగులకు, వికలాంగులకు, మంత్రి  చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో దివ్యాంగులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పలువురు అధికారులు పాల్గొన్నారు.