28-01-2026 12:00:37 AM
వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు.
హనుమకొండ, జనవరి 27(విజయ క్రాంతి): హనుమకొండ హంటర్ రోడ్డులో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 9 నెలల గర్భిణీ అయిన యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన హృదయవిదారకంగా మారింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.కొలంబియా ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మమత (33) సోమవారం సాయంత్రం విధులు ము గించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు.
ఈ క్ర మంలో హంటర్ రోడ్డులో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డాక్టర్ మ మత రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. 9 నెలల గర్భిణీ కావడంతో ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చిం ది. ఒక వైపు తల్లి, మరో వైపు గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సహచరులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆ స్పత్రి పరిసరాలు శోకసంద్రంగా మారాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై వైద్య వర్గాలు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. హంటర్ రోడ్డులో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, భారీ వాహనాలపై కఠిన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
లారీ,కారు ఢీ... ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలు
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో లారీ, కారు ఢీ కొన్న ఘటన వరంగల్ కరీమాబాద్ ఉర్సు గుట్ట, ఖమ్మం బైపాస్ రోడ్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో వర్ధన్నపేట మండలం కక్కిరాలపల్లి ప్రభుత్వఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, నరసింహారెడ్డి, ఉదయశ్రీ, కవిత, సురేఖ అదేవిధంగా పెద్ద తండా ప్రైమరీ పాఠశాల ఉపాధ్యా యుడు వీరలింగయ్య తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఐదుగురు హనుమకొండ నుంచి కారులో పాఠశాలలకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.