13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్

28-03-2026 01:25 AM

కేరళ, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్న ముఖ్యమంత్రి 

హైదరాబాద్, మార్చి 27 (విజయ క్రాం తి): దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిప క్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు 40 మంది సీనియర్‌లతో స్టార్ క్యాంపెయినర్  జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

ఈ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేయను న్నారు. వీటితో పాటు గోవా రాష్ట్రంలోని పోండా నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికలోనూ ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయనున్నారు.