28 March, 2026 | 3:20 AM

వైభవంగా సీతారాముల కళ్యాణం

28-03-2026 01:24 AM

ఘట్ కేసర్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలోని పలు దేవాలయాల ప్రాంగణాలలో శుక్రవారం శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. దేవాలయాల ముందు కళ్యాణ వేదికలను ఏర్పాటు చేసి శ్రీసీతారాముల కళ్యా ణాన్ని వేదపండితులు, బ్రాహ్మనోత్తముల మంత్రో చ్చరణాలతో అతివైభవంగా జరిపించారు.

ఘట్ కేసర్  శివారెడ్డిగూడలోని శ్రీదండ్లగడ్డ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద, ఘనపూర్ లోని శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి.

ఈ కళ్యాణ మహోత్సవాలలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కందాడి అంజిరెడ్డి, టీం రేవంతన్న రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ లు ముల్లి పావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, సొసైటీ మాజీ చైర్మెన్ సార శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మెన్ పలుగుల మాదవరెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, కొంతం బ్రదర్స్ రాంరెడ్డి, అంజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

చౌదరిగూడలో శ్రీకోదండరామ చంద్రస్వామి ఆలయం వద్ద దేవాలయ శాశ్వత ధర్మకర్త దంపతులు మాజీ సర్పంచ్ బైరు రమాదేవి, మాజీ సర్పంచ్ బైరు రాములుగౌడ్ ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది.  అన్నోజీగూడలోని అయ్యప్పస్వామి ఆలయం ఆవరణలో శ్రీసీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాలలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భక్తజనులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.