10 May, 2026 | 11:50 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కాంగ్రెస్ రాజ్యాధికారాన్ని ఉల్లంఘిస్తుంది

08-12-2025 12:00 AM

విలేకరుల సమావేశంలో ఎన్డీ నేత సాగర్ 

టేకులపల్లి, డిసెంబర్ 7,(విజయక్రాంతి): గ్రామ పరిపాలన ప్రధానమని, రాజకీయ పార్టీలు కలుషితం చేశాయని, అధికార కాంగ్రెస్ రాజ్యాధికారాన్ని ఉల్లంగిస్తుందని అన్నారు సిపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాగర్ అన్నారు. టేకులపల్లి మండలం బోడు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై దౌర్జ్యన్యం చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

అదికూడా ఇల్లందు ఎమ్మెల్యే సొంత గ్రామంలో జరగడం సరైంది కాదన్నారు. రాజకీయ పార్టీలకు ఎవరి అభిప్రాయాలూ వారికి ఉంటాయని పోటీ చేసే అధికారం సొంతగా ఉంటుందన్నారు. తమ పార్టీ మం డలంలోని బేతంపూడి, బద్దుతండా, బోడు, రామచంద్రునిపేట, కొప్పురాయి పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఆయా పంచాయతీల్లో 13 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పుడు ఎన్నికలు పోటీకి డబ్బుకు ముడి పడిందన్నారు. దీనితో కొందరు ఆస్తులు అమ్ముకొని పోటీ చేసేందుకు వస్తున్నారని, అలాంటివి విడనాడాలని తెలిపారు. పంచాయతీలకు నిధులు రావాలని, సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడం వలన అభివృద్ధి కుం టుపడిందన్నారు. ఏజెన్సీ లో పోడు భూముల సాగు న్యూడెమోక్రసీ, మరికొన్ని పార్టీలవాళ్లే సా ధ్యమైందన్నారు. దీనికోసం అనేకమంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య గిరిజనుడై ఉండి గిరిజనులను అవహేళనగా మాట్లాడటం వెనక్కి తీసుకోవాలన్నారు.

అభ్యర్థులను అప్పులపాలు చేసి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన వాటిని బీఆర్ ఎస్ ప్రభుత్వ కాలంలో గిరిజనుల నుంచి లాక్కున్నారన్నారు. బోడు కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఉపరితల గనుల ద్వారా ప్రకృతి ద్వాంసం అవుతుందని, భూగర్భగనులు ఏర్పాటు చేయాలన్నారు.

రైతులకు మొ క్కజొన్న క్వింటాకు రూ. 2400, వరికి రూ. 2900, పత్తికి రూ. 8100 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పోరాడే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నాయకులూ డి. ప్రసాద్, కె. వెంకటేశ్వర్లు, ఎట్టి నరసింహారావు, భూక్యా హార్జ్య, నర్సింగ్ తో పాటు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.