14-02-2026 01:33:14 AM
-6 కాంగ్రెస్,4 బీఆర్‌ఎస్, 1 బీజెపి, 1 స్వతంత్ర అభ్యర్థుల గెలుపు
- మ్యాజిక్ ఫిగర్ ను కైవసం చేసుకున్న కాంగ్రెస్
దేవరకద్ర, ఫిబ్రవరి 13: దేవరకద్ర మున్సిపాలిటీ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. మొత్తం 12 వార్డులు ఉన్నప్పటికీ 6 వార్డులలో కాంగ్రెస్, 4 వార్డులలో బీఆర్‌ఎస్,1 వార్డు బిజెపి, 1 వార్డు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపాలిటీలో 1,9, 11,12 బీఆర్‌ఎస్, 4 బీజేపీ, 2,3,5,6,7, 8 కాంగ్రెస్ అభ్యర్థులు,10 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. చైర్మన్ బాధ్యతను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.