11 August, 2026 | 3:26 AM

రైతుకు నీళ్లిస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం

11-08-2026 12:00 AM

బీఆర్‌ఎస్ పోరాటంతోనే కాంగ్రెస్ మేల్కొంది

పెద్దమందడి, ఆగస్టు 10 (విజయక్రాంతి): రైతులకు సాగునీరు అందించాలన్న బీఆర్‌ఎస్ పోరాటం, హెచ్చరికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసిందని బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకటరెడ్డి అన్నారు. రైతులకు నీరు అందించడం స్వాగతించదగ్గ పరిణామమేనని, అయితే నీళ్లు వదిలిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఫొటోలకు ఫోజులిస్తూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. నీళ్లు ఎవరు ఇచ్చారన్నది కాదు.. చివరి ఆయకట్టు వరకు నీరు చేరిందా లేదా అన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందిస్తే స్వాగతిస్తామని, లేకుంటే రైతులతో కలిసి బీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.