రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
సత్తుపల్లి. ఆగస్టు 13 ( విజయ క్రాంతి ): ఎమ్మెల్యే. క్యాంప్ కార్యాలయం లో. రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన.రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా,సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి,సీనియర్ నాయకులు మలిరెడ్డి మురళి రెడ్డి, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ ఎస్ యు ఐ. నాయకులు పాల్గొన్నారు.






