14 August, 2026 | 1:30 AM

వివేకానంద నగర్‌లో వన్ డే.. వన్ డివిజన్

14-08-2026 12:00 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిదిలో సమస్య ల పరిస్కారం కోసం కమిషనర్ ప్రతిష్టత్మాకంగా చేపట్టిన కార్యక్రమం వన్ డే వన్ డివిజన్ గురువారం కూకట్ పల్లి జోన్ వివేకానంద నగర్ కమిటీ హాల్ లో జరిగింది. ఆల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముఖ్యఅతిథులుగా రాష్ట్ర పిఏసి చైర్మన్ అరెకపూడి గాంధీ, సైబరాబాద్ కమిషనర్ సృజనలు హాజరయ్యారు.

కమిషనర్ సృజన వివేకానంద నగర్, వెంకటేశ్వర నగర్ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలలో నెలకొన్న సమస్యలనుకాలనీ అసోసియేషన్ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలోని అధికారులు, సిబ్బంది పనితీరును స్థానిక అసోసియేషన్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పౌర సంబంధ సేవలైన రోడ్లు, డ్రైనే జీ, దోమల ఫాగింగ్, వీధి కుక్కల సమస్య, రోడ్లపై గుంతలు, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలు, చెత్త సేకరణ, వీధిలైట్ల నిర్వహణ తదితర శాఖల విభాగాల పనితీరు అధికారుల పనితీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

పాపి రెడ్డి నగర్ కాలనీ స్థానిక నా యకుడు చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసు కువచ్చారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ప్రతి పౌరునితో అధికారులు సత్సంబంధాలు ఏ ర్పరచుకొని స్థానిక సమస్యలను పరిష్కరించడమే ఉద్దేశ్యంగా వన్డే వన్ డివిజన్ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపా రు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, రంగారావు, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.