16 March, 2026 | 5:07 PM

మార్నింగ్ వాక్‌తో ప్రజలకు మమేకం

16-03-2026 12:24 AM

నిర్మల్, మార్చి ౧౫ (విజయక్రాంతి):  మార్నింగ్ వాక్ దీర్ఘకాలిక వాదులనుంచి రక్షణ కల్పించడమే కాకుండా ప్రజలకు మమేకం అవుతామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వారితో కలిసి మార్కింగ్ వాక్‌లో పాల్గొన్నారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికై మొదటిసారి రావడంతో గణేష్ చక్రవర్తిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాలం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ భీమ సురేందర్, వైస్ ప్రెసిడెంట్ సనుగుల దేవిదాస్, జాయింట్ సెక్రటరీ అనగందుల రాజు, క్యాషియర్ శంకర్ గౌడ్, ఫౌండర్ ప్రెసిడెంట్ పి. దేవేందర్ రెడ్డి ఈ,సి మెంబెర్స్, మునిందర్ రెడ్డి, పోడెల్లి బాపు, కిష్ట రెడ్డి , కే వెంకటస్వామి పాల్గొన్నారు.