16 March, 2026 | 3:46 PM

ఏం చేసినా మాకు అడ్డు ఎవరు..?

16-03-2026 12:26 AM

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సొంత పనులకు వాడకం

అధికార పార్టీ ఓ ప్రజా ప్రతినిధి నిర్వాహకం 

ఇవేం పనులు అని ప్రశ్నిస్తున్న గ్రామ ప్రజలు

వేములపల్లి, మార్చి 15: గత ప్రభుత్వం గ్రామంలోని పారిశుద్ధ్య పనులకు, హరితహారం మొక్కల పెంపకం కొరకు ఒక ట్రాక్టర్ ను నియమించింది. ఈ ట్రాక్టర్ లో గత రెండు రోజులుగా మహిళా సంఘం భవనానికి మట్టి రవాణా చేస్తూ సొంత పనులకు వినియోగిస్తున్నారు. వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం  గ్రామంలో ట్రాక్టర్ ను సొంత పనులకు వినియోగిస్తున్నారు.

ఈ ట్రాక్టర్ ను ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన ఓ ప్రజా ప్రతినిధి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి సొంత పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వాడడం ఏమిటని గ్రామంలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  లక్షలు విలువ చేసి కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను సొంత పనులకు వినియోగించుకోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చర్చ కొనసాగుతుంది.

ఈ ట్రాక్టర్ ను సొంత పనులకు అడ్డగోలుగా ఉపయోగించడంతో జరగరాని ప్రమాదం జరిగిన, మరమ్మతులకు గురైన మళ్లీ ప్రజాధనాన్నే ఎంబి గా చేసి మరమ్మత్తులు చేయిస్తాడే తప్ప తన సొంత నిధులు పెట్టి మరమ్మత్తులు చేయించడు అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

గత రెండు రోజులుగా ట్రాక్టర్ దుర్వినియోగానికి గురవుతున్న అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీని చరా వానిలో కళ్యాణిని వివరణ కోరగా. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వివరాలు నాకు తెలియకుండా ట్రాక్టర్ తీసుకువెళ్లినట్లు తెలిపారు.