10-11-2025 12:00:00 AM
-హెచ్‌సీఎపై డీజీపీకి టీసీఏ సెక్రటరీ ఫిర్యాదు
-బీసీసీఐ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం
-సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 9 : ఒకప్పుడు ఎంతోమంది గొప్ప క్రికెటర్లను అందించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయింది. ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువ య్యాయి. టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌ను పక్కన పెట్టి అన ర్హులను ఎంపిక చేస్తున్నారంటూ ఇటీవలే పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై సమ గ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ధరం గురువారెడ్డి సీఐడీ, డీజీపీ, రాచకొండ సీపీలకు ఫిర్యాదు చేశారు.
జూనియర్, సీనియర్ సెలక్షన్లపై ఇటీవల పలువురు తల్లిదం డ్రులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ, జిల్లా స్థాయిలో అద్భుతంగా ఆడుతున్న ప్లేయర్స్‌కు అవకాశాలు కల్పించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నైపుణ్యం లేని క్రికెటర్లకు అవకాశం కల్పిస్తూ వారి దగ్గర హెచ్‌సీఏ సెలక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న మొత్తం అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ కమిటీలో కొందరు వ్యక్తులు క్రికెటర్ల తల్లిదం డ్రుల దగ్గర లక్షల రూపాయలు తీసుకు న్నట్టు తెలిసిందని చెప్పారు.
ఇప్పటికే హెచ్‌సీఏలో అవినీతిపై నమోదైన పాత కేసుల గురించి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలే కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కి కూడా క్రికెటర్ల తల్లిదండ్రులు దీనిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. దల్జీత్‌సింగ్, బసవరాజులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు.