02-08-2025 12:05:01 AM
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్
హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని, బీసీ కమీషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్(Former BC Commission Chairman Krishnamohan) పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతోందని తెలిపారు. రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు జరిపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ తాము చేస్తున్నది దేశానికే ఆదర్శమని అంటున్నారని, రాష్ట్రపతి వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో రాహుల్ చెప్పాలని ప్రశ్నించారు. తమిళనాడు మోడల్‌లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్ మోడల్‌లో తెలంగాణ ప్రభుత్వం సర్వే చేయించిందని.. బీహార్‌లో ప్రభుత్వం చేసిన సర్వేను హైకోర్టు కొట్టివేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.