calender_icon.png 2 August, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి బీఈడీ అభ్యర్థుల మహాపాదయాత్ర

02-08-2025 12:05:09 AM

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): డీఎస్సీ నోటిఫికేషన్‌లో బీఈడీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బీఈడీ అభ్యర్థుల సంఘం అభ్యర్థులు ఆరోపిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయానికి నిరసనగా ఆగస్టు 3 నుంచి 7 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి హైదరాబాద్ లోని విద్యాకమిషన్ ఎస్సీఈఆర్టీ కార్యాలయం వరకు మహాపాదయాత్ర చేపట్టను న్నట్లు నేతలు భూక్యా కుమార్, కోటగిరి కిరణ్ కుమార్ తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ప్రస్తు తం అమలవుతున్న 30 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాను 80 శాతానికి పెంచి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.