calender_icon.png 19 July, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగం మార్చేందుకు కుట్ర

06-12-2024 01:12:48 AM

డిప్యూటీ సీఎం ఫైర్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి):  రాజ్యాం గాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురు వారం ఆయన ‘బ్లడ్ స్పీక్స్ టూ’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బ్రిటి ష్ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర సమరయోధులు ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకుడు, రచయిత సయ్యద్ షానవాజ్ ఖాద్రీ మంచి పుస్తకం రాశారని అభినందించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డ్  చైర్మన్ సయ్యద్ అస్మతుల్లా హుస్సేని పాల్గొన్నారు.