calender_icon.png 19 July, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

06-12-2024 01:11:32 AM

బీజేపీ ప్రధాన కార్యదర్శికాసం 

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): కులగణనలో పాల్గొనని వాళ్ల ను సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గురువా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఆ పదానికి అర్థం తెలిసే మాట్లా డారా? అని ప్రశ్నించారు. సీఎం  ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేట ని, ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రతో ఏకం చేస్తానం టే.. రేవంత్‌రెడ్డి సామాజిక బహిష్కరణ అంటున్నారని దుయ్యబట్టారు.