calender_icon.png 18 July, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇప్పిస్తా

06-12-2024 01:13:28 AM

* మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

* అల్ఫోర్స్ విద్యాసంస్థల 

చైర్మన్ నరేందర్‌రెడ్డికరీంనగర్, డిసెంబరు 5 (విజయక్రాంతి): కరీంనగర్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులతోపాటు కనీస వేతనం అమలుకు కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. ఎమ్మెల్సీగా గెలిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపుతానని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదలయ్యే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రైవేట్ స్కూల్, కళాశాలల పర్మిషన్ సమయంలో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయని, వాటిని సులభతరం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.