సర్ పేరుతో ఓట్ల తొలగించే కుట్ర
కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -సర్) పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ను కూడా జాగృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ పిలుపునిచ్చారు.
శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమా ర్‌గౌడ్ అధ్యక్షతన వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కోఆర్డినేటర్లు, నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. బూత్ లెవల్ ఏజెంట్‌లు, మండల కమిటీల నియామకాల తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మీనాక్షినటరాజన్ మాట్లాడు తూ సర్ ప్రక్రియ ప్రారంభం నుంచే అలర్ట్‌గా ఉండాలని, బూత్ లెవల్ ఏజెంట్‌తో పాటు కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తుండాలని సూచించారు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. పా ర్టీ మండల, గ్రామ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని, అందుకు జిల్లా నాయకత్వాలు చొరవ చూపాల న్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్లి క్షేత్రస్థాయి లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.






