మహిళల ఆర్థిక సంక్షేమాన్ని కాపాడాలి
- మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి దోహదం
- మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 16 (విజయక్రాం తి): స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులం తా తమ ప్రయోజనాలతోపాటు లక్షలాది మహిళల ఆర్థిక సంక్షేమాన్ని కూడా కా పాడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. పజాభవన్‌లో శనివా రం స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీత క్క మాట్లాడుతూ... స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిదని, సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయన్నారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీని ధిని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మంది కి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించామన్నారు. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమై న బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. స్త్రీనిధి సంస్థపై కావాలనే కొందరు తప్పు డు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి ఆరో పణలను ఉద్యోగులు తిప్పికొట్టాలన్నా రు. స్త్రీనిధి సంస్థ ఏర్పాటులో, దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసిన ఎండీ విద్యాసాగర్‌రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న విద్యాసాగర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, స్త్రీనిధి ఉద్యోగులు పాల్గొన్నారు.






