15-08-2025 03:28:15 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న విఠల్ జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. దొంగతనాల కేసుల ఛేదనలో ఆయన చూపిన కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.శుక్రవారం కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా విఠల్ ఈ అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకున్న విఠల్ ఎస్సై విజయ్ కొండ తో పాటు మద్నూర్ మండల ప్రజలు సన్నిహితులు అభినందించారు.