15-08-2025 03:22:31 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ లో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తున్న బెల్లంపల్లికి చెందిన మామిడి రాజన్నకు శుక్రవారం 79వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ జూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఎస్సై రాజన్న పౌర సేవలు ఉత్తమ విధులు నిర్వహించినందుకు అతనికి పోలీసు శాఖ తరపున ప్రశంసా పత్రాన్ని అందించారు. సిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని, ప్రశంసా పత్రాన్ని అందుకోవడం వల్ల పోలీసు శాఖలో తన బాధ్యత మరింత పెరిగిందని ఎస్సై రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జూ, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.