15-08-2025 03:26:41 PM
చిట్యాల, (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలకేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల(Gurukul school ) (వెలుగు) ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యారినికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలిందని విషయం తెలుసుకొని ఆసుపత్రిలో పరామర్శించారు.ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య, మైధం శ్రీకాంత్, రాజేందర్, రమేష్ ,వివేక్ ,కదం రాజు ,కేంసారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.