15-08-2025 04:25:38 PM
హైదరాబాద్: మాదాపూర్ లో అక్రమంగా నడుస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాల గుట్టు రట్టు అయింది. మాదాపూర్ లోని రెండు ఆస్పత్రుల్లో అక్రమంగా సరోగసీ దందా చేస్తున్నారు. అక్రమంగా సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫెర్టిలిటీ కేంద్రాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నర్రెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్ గా పని చేసినట్లు సమాచారం.
డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎంచుకుంటున్నట్లు తల్లి లక్ష్మి, కుమారుడు. ఎగ్ డోనర్, సరోగసీ మదర్ గా ఒప్పందాలు చేసిన డబ్బు సంపాదించుకుంటున్నారు. లక్ష్మిరెడ్డి.. మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉంది. ఇటివల సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ యజమని డా. నమ్రతను అక్రమంగా సరోగసీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.