15-08-2025 03:24:35 PM
ఎందరో ప్రాణ త్యాగాల ఫలితం స్వాతంత్రం, సిఈ ప్రభాకర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం (విజయ క్రాంతి): ఎందరో మహానీయుల ప్రాణ తగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కేటీపీఎస్ 5, 6 దశలసి ఎం ప్రభాకర్ రావు అన్నారు. శుక్రవారం 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినా ఆయన మాట్లాడుతూ... సుమారు 90 సంవత్సరాల పాటు మన జాతీయ నాయకులు, భారత ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి, ఎందరో ప్రాణ త్యాగం చేయటం ద్వారా భారత దేశానికి స్వాతంత్య్రం సము పార్జించి పెట్టటం జరిగిన దన్నారు. ఆ అమరుల త్యాగం వృధా పోకుండా మనమందరం కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగ స్వాములవాలన్నారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారికి మన వంతు సాయం అందించాలని, అదే మనం ఆ త్యాగధనులకు ఇచ్చే ఘననివాళి అని పేర్కొనటం జరిగినది. ఐదు ఆరు దశలలోని పలు విభాగాల అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు, పార్టిషన్ల పనితీరును మెచ్చుకొని కొనియాడటం జరిగినది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకర రావు గారితో పాటు ఎస్ ఈ లు టి సత్యనారాయణ , జి వి ధర్మారావు , పి. కృష్ణ మోక్షవీర్ , పి. రామారావు , ఇంచార్జ్ ఎస్ ఈ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.