15-08-2025 03:42:32 PM
నల్లగొండ టౌన్,(విజయ క్రాంతి): ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలను, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గాలను, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ పాలకవర్గాన్ని మరో ఆరు నెలల కాలం పాటు పొడిగించినందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , రాష్ట్ర వ్యవసాయం మార్కెటింగ్ సహకార చేనేత వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర రహదారులు, భవనములు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మరో ఆరు నెలలు పొడిగింపు చేసినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆరు నెలల కాలంలో ఈ సహకార వ్యవస్థను ఎంతో అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాశం సంపత్ రెడ్డి, గుడిపాటి సైదులు, కొండ సైదయ్య, ధనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, కందరబోయిన వీరస్వామి , గొల్లగూడ పి ఎ సి ఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగ రత్నం రాజు, పి ఎ సి ఎస్ చైర్మన్ లు పాల్గొన్నారు.