15-08-2025 05:02:10 PM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): బ్రిటిష్ పాలకులపై స్వాతంత్ర సమరయోధులు అమరవీరులు తిరుగులేని పోరాటం చేపట్టి సాధించిన ఫలితమే భారత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్వగృహం వద్ద మొదటగా జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే బాన్సువాడ MLA క్యాంపు కార్యాలయంలో, ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక స్థూపాన్ని ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ సబ్ కలెక్టర్ కిరణ్మయి డిఎస్పీ విట్టల్ రెడ్డితో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధులతోపాటు అమరవీరులు బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు సంకెళ్లు తెంచుకొని భారత జాతి భూభాగాన్ని సాధించేందుకు కోసం పోరాడిన ఫలితమే భారత దేశ స్వాతంత్ర దినోత్సవం అని ఆయన తెలిపారు భారత దేశంలో ప్రజలందరూ సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారంటే కేవలం స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే అని ఆయన పేర్కొన్నారు. అశోక చక్రాన్ని కూడా గౌరవించాలని ఆయన ఆయన అన్నారు. భారత దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు.