నేడు నియోజకవర్గ స్థాయి సర్పంచుల సమావేశం
13-05-2026 12:00 AM
భిక్కనూర్, మే12(విజయ క్రాంతి ): పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాల సందర్భంగా మే 13న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి సర్పంచుల సమావేశాలు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, విద్యా సంస్కరణలపై సర్పంచులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశాలు జరుగనున్నాయి.
కామారెడ్డి నియోజకవర్గ సమావేశం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెనుక ఉన్న యోగ భవన్లో నిర్వహించనున్నారు. బిక్నూర్ గ్రామ సర్పంచ్ బాల్యాల రేఖను జెడ్పీహెచ్‌ఎస్ జీ భిక్కనూర్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి రాజ గంగారెడ్డి ఆహ్వానించారు. వివిధ మండలాల విద్యాధికారులు, సర్పంచులు పాల్గొననున్నారు.






