27 March, 2026 | 2:50 AM

మాసానిపల్లిలో ఫుడ్ ప్రాసెస్ స్టోరేజ్ గోదాం నిర్మాణం

27-03-2026 01:00 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 26 (విజయక్రాంతి): ఆహార ధాన్యాలను నిలువ చేసేందుకు మండలంలోని మాసానిపల్లి గ్రామంలో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో వంద మెట్రిక్ టన్నుల ఫుడ్ క్రాస్ స్టోరేజ్ గోదాం నిర్మాణం చేపట్టనున్నట్లు గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మాసానిపల్లి గ్రామ సర్పంచ్ పెద్దపట్లల్ల సునంద కిషన్ రెడ్డి పలుసార్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వను దృష్టికి మరియు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

దానికోసం మాసంపల్లి గ్రామ శివారు పరిధిలో ఐదుగుంటల విస్తీర్ణంలో 100 మెట్రిక్ టన్నుల ఫుడ్ క్రాస్ స్టోరేజ్  గోదామును నిర్మించడం కోసం గ్రామస్తులతో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈగోదాం నిర్మాణం ద్వారా గ్రామ రైతుల ధాన్యం పంటను ముఖ్యంగా కందులు ఇతర ధాన్యాలను తక్కువ ధరకు అమ్ముకోకుండా నిల్వ చేసుకునే సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.ఈ గోదాం నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్ ద్వారా 30 లక్షల నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వను,స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు గ్రామ ప్రజల తరఫున గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజా గౌడ్,కార్యదర్శి సుభాష్ రెడ్డి,కారోబార్ బైండ్ల నర్సింలు,ఫీల్ అసిస్టెంట్ సంగయ్య,గ్రామస్తులు వెంకట్రాంరెడ్డి,సిద్దిరాంరెడ్డి, మహేందర్ రెడ్డి,బొల్లారం రాజు,శంకరయ్య,సామెల్, బాలు,రాజు,దుర్గయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.