21-01-2026 12:00:00 AM
జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను
పరిశీలన మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యే బండ్ల
గద్వాల్ జనవరి ౨౦ : గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి నుండి ఆత్మకూరు వైపుగా వెళ్లే జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు మంగళవారం పరిశీలించారు. జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా పనులను పూర్తిచేసి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావాలని సూచించారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి జూరాల ప్రాజెక్టు సందర్శన పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు గద్వాలకు ఆత్మకూరు అనుసంధానంగా జూరాల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు.
వెంటనే మంత్రి దీని ఆమోదం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంతాలకు మధ్య అనుసంధానం ఉండడంవల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ, దానివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి రూ 121 కోట్లు రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వెంటనే సీఎం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం చాలా సంతోషం అని హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నుండి గద్వాలకు వెళ్లాలనుకుంటే పదినిమిషాల్లో గద్వాల్ లో చేరుకుంటారు అదేవిధంగా గద్వాల నుండి హైదరాబాదు వెళ్లే వారికి 35 కిలోమీటర్ వరకు రవాణా సౌకర్యం తగ్గుతుంది అని తెలిపారు.
రెండు ప్రాంతాలకు అనుసంధాలు ఉన్నప్పుడే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడి
గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే గద్వాల కు అనుసంధానంగా ఆత్మకూరు మక్తల్ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈ రెండు ప్రాంతాలకు అనుసంధాలు ఉన్నప్పుడే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మా ప్రాంతం కృష్ణానది ఒడ్డున ఉండడం వల్ల ఈ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఈ జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సుజాత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.