23 August, 2026 | 8:53 PM

నల్ల పోచమ్మ కు బోనాలు

23-08-2026 07:59 PM

చేగుంట ఆగస్ట్ 23,విజయక్రాంతి: చేగుంటలోని పట్టణ కేంద్రం లొ ఆదివారం నల్ల పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు, ఉదయం ఘటాన్ని మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు అనంతరం గ్రామ మహిళలు సాంప్రదాయ దుస్తులతో బోనాలను అలంకరించి నల్ల పోచమ్మ అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో తొందరగా మారాయి, భక్తులు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు,   

ఈ సందర్బంగా ఎర్ర యాదగిరి మాట్లాడుతు ఆషాడమాసంలో చేగుంట లొ ఉన్న గ్రామ దేవత అయినటువంటి  నల్ల పోచమ్మ కు  భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారని , పట్టణ,గ్రామ ప్రజలకు వ్యాధులు రాకుండా చల్లగా చూడాలని   పోచమ్మని కొలుస్తారని , అమ్మ వారికి బోనాలకు,మహిళలు కొత్త కుండలలో అన్నం వండి, పసుపు కుంకుమ  వేపాకులతో అలంకరించి,అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తామని అన్నారు. బక్క మైసయ్య.. పూర్ర చంద్రయ్య. బక్క నరసింహులు. ఎర్ర యాదగిరి. కట్ట గణేష్. ఎర్ర శ్రావణ్. బక్క బాబు. ఎర్ర నాగులు. ఎర్ర నరసింహులు. పూర్ర ఆగం. కట్ట గణేష్, బక్క దశరథ్, బక్క రాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.