27 August, 2026 | 1:56 AM

కుర్మపల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

27-08-2026 12:00 AM

24 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల అందజేత

పెద్దపల్లి, ఆగస్టు 26 (విజయక్రాంతి): పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం ‘గుడిసెలు లేని తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా 24 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.