మిలాద్- ఉన్ -నబీ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, సీపీ
27-08-2026 12:00 AM
కరీంనగర్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): మిలాద్-ఉన్-నబీ పండగాను పురస్కరించుకొని బుధవారం నగరంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలె క్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌ స్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రవక్త మహమ్మ ద్ ప్రపంచానికి ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదరభావం వంటి గొప్ప విలువలను బోధించారని తెలిపారు. ఆయన అందించిన సందేశం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రవక్త జీవితం, బోధనల నుంచి స్ఫూర్తి పొందుతూ పరస్పర సామరస్యంతో జీవించాలని పిలుపునిచ్చారు.






