25 ఏండ్ల తరువాత పొలంలో నాట్లు
తంగళ్ళపల్లి, ఆగస్టు-26(విజయక్రాంతి): దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న దారి సమస్యకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి మార్గం చూపింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తును వెంటనే సంబంధిత రెవె న్యూ అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించగా, ఎన్నో ఏండ్లు గా చూస్తున్న సమస్యకు మార్గం సుగ మం అయింది. ఏండ్ల తరబడిగా బీడుగా ఉన్న భూమిలో ఇప్పుడు వరినాట్లు పడి పచ్చదనం..
ఆ కుటుం బంలో సంతోషం నింపుతున్నది.తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సందిరి రా జుకు సర్వే నెంబర్ 173లో 2 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. దాని వద్దకు వెళ్లేందుకు సరైన దారి లేక దాదాపు 25 ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నారు. తన భూమిని బీడుగానే పెడుతున్నారు. తన ఇబ్బందిపై ఈ నెల 03వ తేదీన ప్రజావాణిలో రాజు కుటుంబ సభ్యులు వచ్చి... జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు విన్నవించారు.
దీంతో వెంటనే స్పందించిన సమస్యను పరిష్కరించాలని తంగళ్ళపల్లి రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు జిల్లెల్ల గ్రామానికి చేరుకొని సందిరి రాజు తన పొలం వద్దకు చేరుకునేందుకు దారిని ఇప్పించారు. తన దారి సమస్యకు పరిష్కారం దొరకడంతో రాజు తన పొలాన్ని దున్ని సంతోషంగా వరి నాట్లు వేశారు.






