11 August, 2026 | 1:53 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

వేగం పుంజుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

17-06-2025 04:38 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, ఎమ్మెల్యేలు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇండ్లను కేటాయించి, తొలి విడత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి అందులో, ప్రధమ ప్రాధాన్యం పూర్తిగా పేదలకు కల్పించి ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మంగళవారం మదనాపురంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐదు దశల్లో ఇంటి నిర్మాణానికి తగ్గట్టుగా ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఇంటి నిర్మాణాన్ని జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.