calender_icon.png 22 October, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

22-10-2025 12:28:02 AM

కలెక్టర్ 

 రాయికల్, అక్టోబర్21(విజయక్రాంతి): లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చె ల్లింపులు సకాలంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయికల్ మండలంలోని సింగరావుపేట, శ్రీరాం నగర్, ఇటిక్యాల గ్రా మాల్లో ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ, గ్రా మ పంచాయతీ, హెల్త్ సెంటర్ భవన ని ర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరావుపేట్ లోని ఇందిరమ్మ ఇం డ్లకు అర్హులైన లబ్ధిదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నిర్మాణ పను లు మొదలు పెట్టని వారు ఉన్నట్లయితే వారి ని వెంటనే పనులు ప్రారంభించాలని సూ చించారు. ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇ బ్బందులు ఉన్నాయని ఆరా తీశారు.  గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఎన్ని గ్రౌండ్లింగ్ వరకు వచ్చాయని ఎన్ని స్లాబ్ దశకు వచ్చాయని అధి కారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి సెర్ప్, ద్వారా రు ణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచి తంగా ఇసుక అందిస్తుందని రవాణా కూలీ ల వేతనాలు మాత్రం లబ్ధిదారులు చెల్లిస్తే ఇసుక ఉచితంగా సమకూరుతుందని కలెక్టర్‌స్పష్టంచేశారు.